వర్షం పడింది అంటే చాలు.. హైదరాబాద్ నగరం కలిసి ముద్దవుతుంది.. రహదారులు చెరువులను తలపిస్తాయి. నలాలు పొంగిపొర్లి దుర్గంధంతో ఉన్న నీరు చెత్త తో కలిసి ఇళ్ళ ముందుకు చేరుతాయి. అదే లోతట్టు ప్రాంతాలలో ఉంటే ఇండ్ల లోపలకు చేరుతుంది.


గోషామహల్ నియోజకవర్గం లోని  జాంబాగ్‌ డివిజన్‌ పరిధిలో తోప్‌ఖానా నాలా శనివారం రాత్రి కురిసిన వర్షం ధాటికి చెరువును తలపించే లా  పొంగి పొర్లుతుంది. దీనితో రహదారుల మీద ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బంది పెద్ద సమస్యగా మారింది. ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఉస్మాన్‌గంజ్‌ మార్కెట్‌లో సరుకులు తడిచిపోయాయి.

వెంటనే స్పందించిన అధికారులు నీరు సాఫీగా పోయేలా చర్యలు తీసుకోవడంతో అర్ధరాత్రి తర్వాత   నీటి ప్రవాహం తగ్గింది.పేరుకుపోయిన బురదను జేసీబీ సహాయంతో తొలగించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  ఆదివారం మధ్యాహ్నం వరకు ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. నాలా దగ్గర నీరు నిలిచిపోవడంతో జరుగుతున్న పనులను  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ సందర్శించారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: