మయన్మార్ కాచిన్​ రాష్ట్రం హాపాకంత్​లోని గనిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జాడే మైనింగ్​లో కూలీలు పనిచేస్తోన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. మట్టిదిబ్బల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

 

భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
కాచిన్‌ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. 2015లో కొండచరియలు విరిగిపడి 116 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: