భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ పర్యటనకు వెళ్ళారు. మీడియాకు ఏ విధమైన సమాచారం లేకుండా ఆయన లడఖ్ పర్యటనకు వెళ్ళారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో కలిసి ఆయన పర్యటనకు వెళ్ళారు. లడఖ్ లో చైనా దాడిలో గాయపడిన వారిని మోడీ పరామర్శించే అవకాశం ఉంది. 

 

అదే విధంగా ఆర్మీ అధికారులతో ఆయన మాట్లాడే సూచనలు ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి ఆయన లడఖ్ పర్యటనకు వెళ్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి గాని దానిపై ఏ స్పష్టత రాలేదు. వాస్తవానికి నేడు రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ వెళ్ళాల్సి ఉంది. కాని అనూహ్యంగా మోడీ వెళ్ళడంతో అంతర్జాతీయ మీడియా కూడా ఈ వార్తపై ఆసక్తి చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: