అంతర్జాతీయ విమానాలపై దేశ వ్యాప్తంగా నిషేధం పెంచారు. ఈ నెల 31 వరకు విమానాలను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది డీజీసిఏ. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాలను జూలై 31 వరకు నిలిపివేస్తున్నామని వివరించింది. 

 

ఎంపిక చేసిన మార్గాల్లో కొన్నింటిని అనుమతించవచ్చని వివరించింది. దేశంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల సర్వీసుల నిలిపివేతను జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఎంచుకున్న మార్గాల్లో కొన్ని అంతర్జాతీయ విమానాలకు అనుమతి ఇస్తామని అన్నారు. మార్చ్ నెల 23 నుంచి కూడా అంతర్జాతీయ విమానాలను నిషేధించింది భారత్. ఇక ఇటీవల జులై 15 వరకు అని ప్రకటించి ఇప్పుడు మళ్ళీ పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: