అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఏమో గాని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం చైనా టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. పదే పదే చైనా లక్ష్యంగా ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆయన చైనాను కరోనా వైరస్ విషయంలో టార్గెట్ చేసారు. 

 

చైనా నుంచి వచ్చిన ఫ్లేగు వ్యాధిగా కరోనా వైరస్ ని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పటికీ జరగకూడదనుకున్న దానిని చైనా జరిగేలా చేసిందని ఆయన మండిపడ్డారు. వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిన తర్వాత ఆ సిరా తడి ఆరక ముందే కరోనా వైరస్ బయటపడిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన వ్యాఖ్యలపై చైనా అసహనం వ్యక్తం చేస్తుంది. తమ లోపాలను మా మీద అమెరికా రుద్దుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: