బిహార్​లో పిడుగుపాటు ఘటనల్లో గురువారం 26 మంది చనిపోగా... శుక్రవారం మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మృతి చెందిన వారి కుటుంబాలకూ రూ. 4లక్షల పరిహారం ప్రకటించింది నితీశ్​ కుమార్ ప్రభుత్వం.బిహార్​లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటు ఘటనలు సంభవించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో శుక్రవారం సంభవించిన పిడుగుపాటు ఘటనల్లో 13 మంది చనిపోయారు. వీరి కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

 

 

బిహార్ వ్యాప్తంగా గురువారం వివిధ ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటు ఘటనల్లో 26మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గత వారం రోజుల్లోనే పిడుగు పాటు ఘటనల వల్ల 100మందికిపైగా మృతి చెందారు.ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​ విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణ విభాగ అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: