భారత్​లో టిక్​టాక్​ సహా 59చైనా యాప్​లను నిషేధించిన తర్వాత.. వాటి ప్రత్యామ్నాయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా టిక్​టాక్​కు భారత్​లో ఉన్న మార్కెట్​ అంతా ఇంతా కాదు. అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు దేశీయంగా పలు యాప్​లు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ రేసులోకి సామాజిక మాధ్యమ దిగ్గజం ఇన్​స్టాగ్రామ్ కూడా ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టిక్​టాక్​ను పోలి ఉన్న ఫీచర్లను రీల్స్ పేరుతో గత ఏడాది నవంబర్​లో ఆవిష్కరించింది ఇన్​స్టాగ్రామ్. ఈ ఫీచర్​పై ఫ్రాన్స్​, జర్మనీల్లో ట్రయల్స్ నిర్వహించినట్లు ఇన్​స్టాగ్రామ్​ గతవారం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు త్వరలోనే భారత్​లో ఈ ఫీచర్​ను ఇన్​స్టాగ్రామ్​ పరీక్షించనున్నట్లు సమాచారం.

 

 

భారత్‌లో ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్లకు ఇన్​స్టా దీనిని అందించిందని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. అందుకే ఈ టెక్నాలజీ అందుకోవాల్సిన దేశాల జాబితాలో భారత్‌ లేదని తెలిపింది. రీల్స్‌లో కూడా 15క్షణాల పాటు వీడియోను చేసే అవకాశం ఉంది. దీనికి అవసరమైన ఆడియోను ఎడిట్‌ చేసుకోవచ్చు.కొత్త ఫీచర్ జోడిస్తే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు పెరుగుతారని భావిస్తున్నట్లు ఇన్​స్టాగ్రామ్ మాతృసంస్థ ఫేస్​బుక్ తెలిపింది. అయితే కొత్త ఫీచర్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: