నల్గొండ జిల్లా చందంపేటలో జరిగిన ఘర్షణలో... చందంపేట జడ్పీటీసీ రమావత్ పవిత్ర తండ్రి లాలూ నాయక్ మృతి చెందారు. కుటుంబ, రాజకీయ కక్షలతో ఇతర పార్టీకి చెందిన వ్యక్తులు లాలూ నాయక్​పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటం వల్ల దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్​కు తరలిస్తుండగా మార్గమధ్యంలో లాలూ నాయక్ మరణించాడు.

 

లాలూ నాయక్ మొదటి నుంచి కాంగ్రెస్​లో కొనసాగి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరాసలో చేరారు. చందంపేట జడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కావడం వల్ల కూతురు పవిత్రను ఎన్నికల బరిలో నిలిపి గెలిపించుకున్నారు. లాలూ హత్యతో చందంపేట మండలంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: