ఒక పక్క కరోనాతో నానా బాధలు పడుతుంటే మిడతల దండు వ్యవహారం పెద్ద తల నొప్పిగా  మారింది. భారత్ లోకి పాకిస్తాన్ నుంచి వచ్చిన మిడతల దండు ఇప్పుడు హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలపై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) భారత్‌ కు కీలక సూచన చేసింది. 

 

 మరో నాలుగు వారాల పాటు మిడతల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని కాబట్టి చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించింది. భారత్ లో 26 ఏళ్ళల్లో ఎప్పుడు లేని విధంగా మిడతలు దాడి చేశాయని పేర్కొంది. గుజరాత్ రాష్ట్రానికి కూడా మిడతలు రాజస్థాన్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: