ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని ఆగడం లేదు. కరోనా కట్టడికి సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా సరే ప్రపంచ దేశాల్లో కరోనా తన ఉగ్రరూపం చూపిస్తూనే ఉంది. ఇక ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కోటీ 15 లక్షలు దాటాయి. ప్రతీ రోజు లక్షకు పైగా కేసులు వస్తున్నాయి. 

 

ఇప్పటి వరకు  1,15,57,810  కరోనా కేసులు నమోదు అయ్యాయి. 5,36,786 మంది కరోన అబారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 65,35,598 మంది ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. న్యూజెర్సీ, న్యూయార్క్‌ లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు 50 వేల కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ 30 లక్షలకు చేరువలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: