గత నెల 29న జరిగిన నకిలీ శ్రీలంక టీ20 లీగ్​లో తాజాగా రవీందర్​ దండివాల్​ అనే మరో వ్యక్తి అరెస్టు అయ్యాడు. పంజాబ్​లోని మొహలీ జిల్లాలో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఏసీయూ బృందం చీఫ్​ అజిత్​ సింగ్​ స్పష్టం చేశారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.గతంలోనూ అంతర్జాతీయ టెన్నిస్​ మ్యాచ్​ ఫిక్సింగ్​ స్కామ్​లోనూ నిందితుడుగా ఉన్నాడు రవీందర్​.

 

లాక్‌డౌన్‌ వేళ.. దేశవ్యాప్తంగా ఎక్కడా క్రికెట్‌ మ్యాచ్‌లు జరగట్లేదు. క్రికెటర్లు ప్రాక్టీస్‌ కూడా చేయట్లేదు. అలాంటి సమయంలో పంజాబ్‌లోని చండీగఢ్‌ సమీపంలోని ఓ పల్లెటూరిలో జూన్​29న ఉవా క్రికెట్‌ లీగ్‌ పేరుతో(శ్రీలంక టీ20 లీగ్ ) ఓ మ్యాచ్‌ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్​లైన్​లో లైవ్​ స్కోర్​ కూడా వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌తో తమకేమీ సంబంధం లేదని ఇటు భారత్‌, అటు శ్రీలంక క్రికెట్‌ బోర్డులు స్పష్టం చేశాయి.దీంతో పంజాబ్​ పోలీసులూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికీ పంకజ్‌ జైన్‌, రాజు అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. తాజాగా రవీందర్​ దండివాలా అనే మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: