ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నేడు జమ కానున్నాయి. ఇటీవల  మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం  పొందలేదు. దీనితో జీతాలకు దాదాపు ఆరు రోజులకు పైగా ఆలస్యం అయింది. అయితే శనివారమే గవర్నర్ నుంచి బిల్లుకి ఆమోదం లభించినా సాంకేతిక కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. 

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేటి నుంచి జీతాలను జమ చేస్తారు. గత నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ నేటి రాత్రి నుండి మొదలై రేపటిలోపు ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు జమ కానున్నాయి. కాగా ఇప్పటికే ఉద్యోగస్తులకు జీతాలు ఆలస్యం కావడంపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: