తెలంగాణా పాత సచివాలయం  కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి మొదలైన కూల్చివేత పనులు రోడ్లు మరియు భవనాల అధికారులు సమక్షంలో కూల్చి వేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ భవనం కూల్చివేతను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ట్రాఫిక్ ని భారీగా మళ్ళించారు. 

కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జేసీబీలు భవనాలను కూల్చివేస్తున్నాయి. సిఎస్, డీజీపీ పాత సచివాలయం వద్దనే ఉన్నారు. ఇక  ఇదిలా ఉంటే కొత్త సచివాలయ భవనం కి సంబంధించిన డిజైన్ ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆరు అంతస్తుల్లో ఈ భవన నిర్మాణం ఉండే అవకాశం ఉంది. ఏడాదిలోపు దీనిని పూర్తి చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది కొత్త సచివాలయానికి సిఎం ఆమోద ముద్ర వేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: