ఉద్యోగాలను భర్తీ చేసే విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దెబ్బకు ఆదాయం కూడా భారీగా తగ్గింది కాబట్టి ఉద్యోగాలు ఇప్పట్లో లేవని స్పష్టం చేసింది. కరోనా దెబ్బకు రైల్వే ఆదాయం దాదాపు 58 శాతం మేర తగ్గిందని పేర్కొంది. భద్రత(సేఫ్టీ) విభాగంలో మినహా ఇతర విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కి సంబంది ప్రక్రియను నిలిపివేసింది. 

 

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఉద్యోగాల ప్రక్రియకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ లు విడుదల చేయవద్దు అని రైల్వే బోర్డ్ అన్ని జోన్ లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వివిధ దశల్లో ఉన్న నియామక ప్రక్రియలు మాత్రం కొనసాగుతాయని పేర్కొంది. ఉద్యోగాలు తొలగించేది లేదని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: