ఏపీలో  జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది . అక్రమ మద్యం  రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టం రూపుదిద్దుకొంది. ఈ క్రమంలోనే అక్రమ మద్యం విక్రయించిన తరలించిన  శిక్ష తీవ్రంగా ఉంటాయని ఏపీ ఎక్సైజ్ చట్టం 14 ప్రకారం నాన్బెయిలబుల్ కేసులు నమోదవుతాయని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా ఎనిమిది సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని తెలిపారు. 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుంటే గత కొంతకాలంగా అక్రమ మద్యం వెల్లువలా  ప్రవహిస్తోంది. అవాంఛనీయ ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: