సురక్షితమైన కరోనా వ్యాక్సిన్​ను ఈ ఏడాది చివరినాటికి అభివృద్ధి చేసేందుకు సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్​ఐఐ) ప్రయత్నిస్తోందని ఆ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్ తయారీ విషయంలో ఎలాంటి హడావుడి లేదని పేర్కొన్నారు.

 

మైల్యాబ్స్​ సొల్యూషన్స్ సంస్థ తయారు చేసిన 'కాంపాక్ట్ ఎక్స్​ఎల్' డయాగ్నోస్టిక్ మెషిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... సమర్థమంతమైన వ్యాక్సిన్ తయారీపైనే దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు.

 

వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా పరీక్షలు నిర్వహించడం చాలా కీలకమని పూనావాలా పేర్కొన్నారు. అందుకే మైల్యాబ్స్​లో ఎస్​ఐఐ పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. భారత్​లో సరిపడా పరీక్షలు జరగడం లేదని అన్నారు. కేసులు పెరుగుతాయన్న భయం ఉండకూడదని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: