కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ  పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం రాజ్ నివాస్ లోని పి ఆర్ ఓ ఆఫీస్ లో ఒకరు కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. 

 

 దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 48 గంటల పాటు గవర్నర్ కార్యాలయాన్ని మూసివేసి శానిటేషన్ చేయాలని నిర్ణయించారు అధికారులు. పి ఆర్ వో లో పనిచేసే సిబ్బంది తో పాటు మిగతా సిబ్బంది కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: