కేరళలో 30 కేజీల బంగారం స్మగ్లింగ్ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం పినరయి విజయన్. ఈ కేసులో తక్షణమే జోక్యం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేయాలని వినతి చేశారు. ఈ కేసు దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేలా ఉందన్నారు. అలాగే ఈ అంశంలో ఒకటికి మించిన కోణాలున్నాయని లేఖలో తెలిపారు.
ఈ కేసు దర్యాప్తు అన్ని కేంద్ర సంస్థల సహకారంతో ప్రభావవంతంగా జరగాలని లేఖలో పేర్కొన్నారు విజయన్. కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదలొద్దని కోరారు.

 


ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన.. సరకు రవాణా విమానంలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి అయిన సరిత్‌ అనే వ్యక్తి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సరిత్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. స్వప్నాపై లుక్​ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ కాన్సులేట్‌కు వచ్చే పార్సిళ్ల ద్వారా 30 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: