ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) నుంచి వైదొలగాలని అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా తప్పుపట్టింది. ఈ చర్య అమెరికా ఏకపక్షవాదానికి నిదర్శనమని విమర్శించింది.
కరోనా వైరస్ మూలాలు తెలుసుకునేందుకుగాను డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం.. చైనాలో పర్యటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాపై బీజింగ్ విమర్శలు గుప్పించింది.

 

 

గతేడాది చివర్లో చైనాలోని వుహాన్​లో కరోనా కేసులు మొదలయ్యాయి. అయితే చైనాగానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ... మిగతా ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో విఫలమయ్యాయని అమెరికా విమర్శించింది. దీనితో చైనా కూడా అగ్రరాజ్యంపై ప్రతివిమర్శలు చేసింది. ఇవి ఇంకా కొనసాగుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: