భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రపంచస్థాయి వేదికపై ప్రసంగించనున్నారు. బ్రిటన్​లో నిర్వహించనున్న 'ఇండియా గ్లోబల్ వీక్- 2020' కార్యక్రమంలో భాగంగా వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల అంశంపై మాట్లాడనున్నారు.


భారత్​కు సంబంధించినంత వరకు ప్రపంచీకరణ విషయంలో అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమంగా పేర్కొంటున్న 'ఇండియా గ్లోబల్ వీక్'​లో ప్రధాని మోదీ ఆన్​లైన్ మాధ్యమం ద్వారా పాల్గొననున్నారు. భారత్​లో ఉన్న తయారీ, పెట్టుబడి అవకాశాల గురించి పెట్టుబడిదారులకు వివరించనున్నారు. జులై 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

 

కరోనా నేపథ్యంలో సమావేశాలను పూర్తిగా ఆన్​లైన్​లోనే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఎస్​ జయ్​శంకర్, పీయుష్ గోయెల్, హర్​దీప్ సింగ్​ పూరీ,రవిశంకర్ ప్రసాద్, మహేంద్ర నాథ్ పాండే హాజరుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: