ద‌క్షిణ కొరియా అధ్య‌క్ష పదవి రేసులో ఉన్న వ్య‌క్తి, సియోల్ న‌గ‌ర మేయ‌ర్ పార్క్‌-వోన్‌-సూన్ (64) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. త‌న‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చిన మ‌రుస‌టిరోజే పార్క్ త‌నువు చాలించారు. న‌గ‌రంలోని ఓ ప‌ర్వ‌త ప్రాంతంలో పార్క్ మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. 

 

అనంత‌రం మేయ‌ర్ అధాకారిక‌ నివాసంలో ల‌భ్య‌మైన‌ సూసైడ్ నోట్‌ను అధికారులు గుర్తించారు."ప్ర‌తి ఒక్కరూ న‌న్ను క్ష‌మించండి. నా సుదీర్ఘ జీవితకాలంలో నాతో పాటు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. అత్యంత బాధ క‌లిగించినందుకు నా కుటుంబస‌భ్యులు కూడా న‌న్ను క్ష‌మించండి" అని సూసైడ్ నోట్‌‌లో పార్క్ పేర్కొన్నారు. అయితే, త‌న‌పై వ‌చ్చిన‌ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఎలాంటి విష‌యాల‌నూ నోట్‌‌లో మేయ‌ర్ ప్ర‌స్తావించ‌లేదు.పాలనా విధానం.. వ్యక్తిగత ప్రవర్తనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సూన్​.

 

 ఆయన మృత దేహం సియోల్​కు చేరుకోగానే వేలాది మంది అభిమానులు 'సూన్​ వీ లవ్ యూ' అంటూ నినాదాలు చేశారు. ​సామాజిక మాధ్యమాల్లో సూన్​కు సంతాపం తెలుపుతూ మెసేజ్​లు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: