హాకీ ఇండియా ప్రెసిడెంట్​​ ముష్తాక్​ అహ్మద్​ వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా ఆ పదవికి తాజాగా రాజీనామా చేశారు. జాతీయ క్రీడా కోడ్​లోని పదవీకాల మార్గదర్శకాలతో పాటు ఆ పదవి కోసం ఎన్నికల్లో ఉల్లంఘనలకు పాల్పడినట్లు క్రీడా మంత్రిత్వశాఖ పేర్కొంది. అందుకు రాజీనామా చేయమని సదరు మంత్రిత్వ శాఖ అహ్మద్​ను ఆదేశించింది.శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక శాఖ అహ్మద్ రాజీనామా ఆమోదించింది. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్​గా ఉన్న జ్ఞానేంద్రో నిగోంబంను కొత్త అధక్షుడిగా నియమించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: