ప్రముఖ నేపథ్య గాయకుడు అశోక్ తేజ ఇటీవలే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం విషమించింది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు, అయితే తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో స్పందించిన సుద్దాల అశోక్ తేజ... ఓ సందేశాన్ని విడుదల చేశారు.


శస్త్ర చికిత్స జరిగిన 47 రోజులు అయిందని నేను ప్రస్తుతం బాగానే ఉన్నానని... నా ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతుందని.. నా ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులు నమ్మవద్దు అంటూ అభిమానులకు సూచించారు. నా ఆరోగ్యం గురించి స్పష్టత కోసం నేరుగా నాకే ఫోన్ చేయండి అంటూ ఓ సందేశాన్ని విడుదల చేశారు సుద్దాల అశోక్ తేజ.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: