గణేష్ మహోత్సవాలు అనగానే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది మహారాష్ట్ర. ఆ రాష్ట్రంలో వినాయకుడ్ని చాలా వరకు ప్రజలు ఆదరిస్తూ ఉంటారు. అందుకే వినాయక చవితి రాగానే వేడుకలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనే సంగతి తెలిసిందే. అయితే ఈసారి కరోనా దెబ్బకు వేడుకల మీద ప్రభావం పడింది. 

 

తాజాగా అక్కడి ప్రభుత్వం గణేష్ వేడుకలను నిర్వహించే వారికి కీలక సూచన చేసింది. ఈ ఏడాది గణేశోత్సవ్ వేడుకలకు అన్ని 'మండలాలు' సంబంధిత మునిసిపాలిటీ లేదా స్థానిక అధికార యంత్రాంగం నుండి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరని అని రాష్ట్ర హోం శాఖ సర్క్యులర్ జారీ చేసింది. అలాగే, గరిష్ట విగ్రహ ఎత్తు 4 అడుగులు మాత్రమే ఉండాలి అని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: