ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. పీఎం కేర్స్​ నిధికి విరాళాలు అందించిన దాతల పేర్లను మోదీ వెల్లడించకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో ప్రధాని భయపడుతున్నారా అంటూ ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

 

పీఎం కేర్స్​ నిధులను సమీక్షించేందుకు పార్లమెంట్​ ప్యానల్​ను భాజపా ఎంపీలు అడ్డుకున్నారన్న వార్తలను ట్వీట్​కు జతచేశారు రాహుల్​ గాంధీ.

 

కొద్ది రోజులుగా పీఎం కేర్స్​ నిధులపై ఆడిట్​ జరగాలని రాహుల్​ గాంధీ సహా కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు రాహుల్​. ప్రజల నుంచి డబ్బు అందిన నేపథ్యంలో ఆడిట్​, సమీక్ష పరిధిలోకి తప్పనిసరిగా తీసుకురావాలని డిమాండ్​ చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: