ధారావీ... ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. అక్కడికి కరోనా వెళ్తే  కరోనా వైరస్ ని కట్టడి చేయడం చాలా కష్టం. సామాజిక దూరం అనే మాట అక్కడ వినపడినా సరే పాటించే అవకాశం ఉండదు.  ఒక్కో గల్లీలో ఒక బండి వెళ్తే ఇంకో బండి వెనక్కు నడుపుకుని రావాలి. అలాంటి గల్లీల్లో కరోనా వైరస్ ని కేవలం మూడు సూత్రాలు కట్టడి చేసాయి. 

 

వైరస్‌ వ్యాప్తి గురించి అప్రమత్తంగా ఉండట౦ ఒకటి అయితే ట్రాకింగ్‌ (రోగులను గుర్తించడం), టెస్టింగ్‌ (పరీక్షలు జరుపడం), ట్రీటింగ్‌ (చికిత్స అందించడం) వంటివి చాలా సమర్ధవంతంగా చేసారు. ఏప్రిల్ 1 న మొదటి కేసు వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా అక్కడ ఇవి సమర్ధవంతంగా జరగడంతో లక్షల మంది ప్రజలు ఉండే ప్రాంతంలో కేవలం రోజు 10 కేసుల లోపే నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: