మహారాష్ట్రలో కరోనా  కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి చర్యలు ఏ మాత్రం ఫలించడం లేదు.  కరోనా ఇప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ అధికారిక కార్యాలయం రాజ్ భవన్ ను కూడా తాకింది. ముంబైలోని రాజ్ భవన్ (గవర్నర్ నివాసం)లో 18 మంది సిబ్బంది కరోనా బారిన  పడ్డారు. 

 

ఇక గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కి కూడా కరోనా పరిక్షలు చేస్తున్నారు. ఆయన కరోనా బారిన పడే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇక  రాజ్ భవన్ లో పని చేసే అందరికి కూడా కరోనా పరిక్షలు చేస్తున్నారు. రాజ్ భవన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: