కరోనా రోగులకు వైద్యం చేసే సిబ్బందికి ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా తక్కువే.. అందుకే కొంతమంది వ్యాపారవేత్తలు వారికి  కొన్ని ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు లో బాగా సుపరిచితమైన ఓ  నగల సంస్థ  కరోనా మహమ్మారి తో పోరాటం చేస్తున్న సిబ్బందికి ఆఫర్ ప్రకటించింది. అలాగే అమెరికాలో కరోనా రోగులకు సేవచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఉచిత వెడ్డింగ్ గౌన్లు అందజేయాలని ఎటువంటి లాభం ఆశించకుండా ఓ సంస్థ ముందుకు వచ్చింది.

 

ఇదేవిధంగా అమెరికాలోని ఓ ఆసుపత్రిలో పనిచేసే నికోల్ హారిస్ అనే ఓ హెడ్ నర్స్ తన అభిప్రాయాన్ని చెప్పారు. తనకి కొద్ది రోజులలో పెళ్లి జరగనుంది. అయినప్పటికీ కరోనా రోగులకు వైద్యం ఇవ్వడం లో తాను అలసి పోతున్నట్లు.. పెళ్లికి షాపింగ్ చెయ్యడానికి సమయం లేదని తెలిపారు. ఇలాంటి సమయంలో ఈ వెడ్డింగ్ గౌన్లు ఉచితంగా రావడం చాలా ఆనందకరమైన సంఘటనని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: