వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటీషన్ వేయగా వైకాపా గుర్తింపు రద్దు కేసుపై నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్ట్. ఎలక్షన్ కమిషన్, వైకాపాలకు నోటీసులిచ్చి౦ది. తదుపరి విచారణ సెప్టెంబర్ 3కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లోగా కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. కాగా తమ పార్టీ పేరును అనుకరిస్తున్నారని ఫిర్యాదు చేసారు.

 

లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్ట్ కి వెళ్ళారు. ఎన్నికల కమిషన్లో నమోదైన ప్రకారం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరు వాడాలని, అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు వాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: