భారత్ లోని జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉన్నాయి అని  ఇటీవల ఆర్మీ నుంచి ఒక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 200 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దుల నుంచి భారత్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వారికి నేపాల్ నుంచి సహకారం అందుతుంది అనే వార్తలు వస్తున్నాయి. 

 

నేపాల్ నుంచి ఉగ్రవాదులను బీహార్ లోకి పంపించే అవకాశం ఉంది నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.  వారికి పాక్ ఆర్మీ నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత ఆర్మీ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఏ మాత్రం కూడా ఉపేక్షించేది లేదు అని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: