ఇంతకాలం రాజకీయంగా భారత్​పై తీవ్ర విమర్శలు చేసిన నేపాల్​ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల దైవం రాముడు భారతీయుడు కాదని.. రాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య భారత్​లో లేదని వ్యాఖ్యానించారు. అసలైన అయోధ్య నేపాల్​లో ఉందని.. రాముడు నేపాల్​ దేశస్థుడని ఓలి తెలిపినట్టు ఆ దేశ మీడియా కథనం ప్రచురించింది.

 


భారత్​- నేపాల్​ మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా బలహీనపడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​లోని మూడు ప్రాంతలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ.. ఓ మ్యాప్​ను విడుదల చేసింది నేపాల్​ కమ్యూనిస్ట్​ ప్రభుత్వం. అనంతరం ఆ మ్యాప్​ను నేపాల్​ పార్లమెంట్​లో ఆమోదింపజేసుకుంది. అప్పటి నుంచి నేపాల్​ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. భారత్​పై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు ఓలి. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి భారత్​ కుట్ర పన్నుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయనకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. భారత్​తో ఉన్న సత్సంబంధాలను ఓలి నాశనం చేస్తున్నారని.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలి పార్టీలోని సీనియర్​ నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: