తెలంగాణాలో ఇప్పుడు మళ్ళీ మావోయిస్ట్ ల ఆలజడి మొదలయింది. అడవులు వర్షాలు  పడి  పచ్చగా ఉండటంతో మావోల కదలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇన్ని రోజులు దట్టమైన అడవుల్లోకి వెళ్ళిన మావోలు ఇప్పుడు బయటకు వస్తున్నారు. దీనితో తెలంగాణా పోలీసులు అప్రమత్తం అయ్యారు. కొమరం భీమ్ జిల్లాలో మావోయిస్టుల  కదలికల వార్తల నేపథ్యంలో తిర్యాణి అడవుల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. 

 

భారీగా ఆ ప్రాంతంలో మొహరించారు. అడవిని జల్లెడ పడుతున్నారు.  ఇక్కడి నుంచి కొందరు మావోయిస్టు నేతలు తప్పించుకున్నారు అని సమాచారం అందడంతో వారి లక్ష్యంగా లక్ష్యంగా గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు నేతలు భాస్కర్, వర్గీస్‌లు అక్కడి నుంచి తప్పించుకున్నారు అని ఇప్పటికే పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: