రాజస్థాన్ రాజకీయాలు  రోజుకొక మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సచిన్ పైలెట్ తిరుగుబాటు చేయడంతో ప్రస్తుతం.. రాజస్థాన్లో ప్రభుత్వం లో సంక్షోభం ఏర్పడుతుందా అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే తమకు 104 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి గెహ్లాట్ 
 క్లారిటీ ఇచ్చారు. 

 

 అయితే తాజాగా రాజస్థాన్ పవర్ గేమ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. సచిన్ పైలెట్ ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. సీఎల్పీ సమావేశంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న 104 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేసి సచిన్ పైలెట్ ను డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నిర్ణయంతో రాజస్థాన్ రాజకీయాలు  కీలక మలుపు తిరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: