ఈఎస్ఐ స్కామ్ లో  అరెస్టయిన టిడిపి శాసన సభ ఉప నేత అచ్చెన్నాయుడు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అచ్చన్నాయుడు బెయిల్ పిటిషన్ పై  ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. గతంలో బెయిల్ మంజూరు చేయాలంటూ అచ్చన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

 

 అయితే అంతకుముందు తన  ఆరోగ్యం సరిగా లేదని తనను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలి  అంటూ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరి అచ్చన్నాయుడు బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది. దీనిపై మరోసారి గురువారం విచారణ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: