కరోనా చికిత్సలో ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సను ఉచితం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అందులో కామినేని, మల్లారెడ్డి, మమత ఆస్పత్రుల్లో వైద్యం ఉచితంగా చేయాలని ఆదేశాల్లు ఇచ్చింది. 

 

ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి అనే ఆరోపణల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణా సర్కార్. నిన్న హైకోర్ట్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ ఆస్పత్రుల్లో కరోనా ఉచిత చికిత్సకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ప్రసంశలు వస్తున్నాయి. కిమ్స్ లో ఇటీవల 4 లక్షలు ఫీజు వసూలు చేసారనే ఆరోపణ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: