గత కొన్ని రోజులుగా తెలంగాణాలో సైలెంట్ గా ఉన్న మావోల కదలికలు మళ్ళీ మొదలయ్యాయి. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మావోలు అడవులు వర్షాలు పడి పచ్చబడటంతో మళ్ళీ తమ కార్యాకలాపాలను వేగవంతం చేసారు. తాజాగా కొమరం భీమ్ జిల్లాలో వారి  కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మావోయిస్టులు-పోలీసులకు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. 

 

తిర్యాణీ అడవుల్లో వారు ఉన్నారు అనే సమాచారం పోలీసులకు రెండు రోజుల క్రితం సమాచారం రావడంతో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో మావో అగ్ర నేతలు తప్పించుకున్నారు. తాజాగా జరుగుతున్న ఎదురు కాల్పులలో కూడా వారు తప్పించుకున్నారు అని సమాచారం. దీనితో అడవిలో ఇప్పుడు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి బలగాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: