తమ అంచనాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో జూలై 15 నాటికి 2.25 లక్షల కేసులు ఊహించామని... కాని సమిష్టి కృషి తర్వాత ఈ కేసులు సగంలో ఉన్నాయని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఈ రోజు అక్కడ కేవలం 1.15 లక్షల కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. అదే విధంగా రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది అని ఆయన చెప్పారు. 

 

కరోనా వైరస్ పై తాము ఒంటరిగా పోరాడాలి అని భావించామని కాని అది సాధ్యం కాలేదని ఆయన అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం మత సంస్థలతో పాటు గా ఎన్జీవొల సహకారం కూడా తీసుకున్నామని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు నా కృతజ్ఞతలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: