తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ యాక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మాజీ ఇటీవలే తన కొడుకును తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ పిట్టకథ అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. కమర్షియల్గా మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు. అయితే తాజాగా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

 

 యు.వి.క్రియేషన్స్ ప్రస్తుతం సంజయ్  హీరోగా తెరకెక్కుతున్న సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. అడల్ట్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ కూడా  మరో ముఖ్య పాత్ర కూడా పోషించనున్నట్లు సమాచారం. చాలా తక్కువ బడ్జెట్లో వైజాగ్ పరిధిలోనే ఈ సినిమా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: