గాంధీ ఆసుపత్రిలో జీతాలు పెంచి తమను రెగ్యులరైజ్ చేయాలి అంటూ అవుట్ సోర్సింగ్  నర్సులు డ్యూటీకి హాజరు కాకుండా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో  గాంధీ ఆస్పత్రిలో నాల్గవ తరగతి ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. ఇక గాంధీ ఆస్పత్రి సిబ్బంది మొత్తం ఆందోళన బాట పట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

 ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో నర్సు లతోపాటు నాలుగో తరగతి సిబ్బంది కూడా ఔట్ సోర్సింగ్ విధానం లో పనిచేస్తున్నారు. ఇదే సమయంలో కొత్తగా తీసుకునే వాళ్లకు ఎక్కువ జీతం ఇస్తున్నారు అంటూ సిబ్బంది పలు ఆరోపణలు చేస్తున్నారు. తమకు జీతాలను పెంచడంతోపాటు ఔట్ సోర్సింగ్  విధానం నుంచి రెగ్యులరైజ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: