హైదరాబాద్ లో ఎన్ని విధాలుగా హెచ్చరించినా సరే ఆక్సీజన్ సిలెండర్ లు మాత్రం బ్లాక్ లో అమ్ముతూనే ఉన్నాయి ముఠాలు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా మరోసారి భారీగా ఆక్సీజన్ సిలెండర్ లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 84 పెద్ద ఆక్సీజన్ సిలెండర్ లను పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. 

 

శాకీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాస్ అనే సంస్థ ద్వారా అతను వీటిని విక్రయిస్తున్నాడు. దానికి యజమాని కూడా అతనే. ఆక్సీజన్ సిలెండర్ కొరతను క్యాష్ చేసుకోవాలి అని అతను ప్లాన్ చేస్తున్నట్టు గుర్తించారు. అతని మీద పలు సెక్షన్ ల  కింద కేసులు కూడా నమోదు చేసారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: