కరోనా వైరస్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం  వద్దని తెలంగాణా మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దని, ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ ఉన్నట్టుగానే భావించి అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దన్నారు ఆయన. 

 

తెలంగాణాలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. దేశంలో కూడా కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. కరోనా పాజిటివ్ వచ్చినా ఆందోళన చెందకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు అని ఆయన సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే భయంతో వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి డబ్బును నష్టపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. కరోనాకు ఎక్కడైనా ఒకటే వైద్యమని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: