ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. గతేడాది ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ రెండో స్థానంలోకి చేరాడు. అమెజాన్‌ సంస్థ నష్టాలను చవిచూడడం, విడాకుల కారణంగా ఆయన సతీమణి భారీ స్థాయిలో భరణం పొందడంతో.. బెజోస్‌ ఏడు బిలియన్ల డాలర్ల స్టాక్‌ వాల్యూను కోల్పోయాడు.
 
ప్రపంచంలో అపర కుబేరుడు అన్న ట్యాగ్‌ను అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ కోల్పోయారు. ఆయన స్థానంలోకి మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వచ్చి చేరారు. త్రైమాసిక ఫలితాల్లో జెఫ్‌ బెజోస్ 7 మిలియన్ల డాలర్ల స్టాక్‌ విలువను పోగొట్టుకున్నారు. ట్రేడింగ్‌లో ఆయన షేర్ల విలువ 7 శాతం పడిపోయింది. దీంతో ఆయన సంపద 103.9 బిలియన్‌ డాలర్ల వద్ద స్థిరపడింది. బిల్‌ గేట్స్‌ ప్రస్తుతం సంపద 105.7 బిలియన్‌ డాలర్లు. అమెజాన్‌ షేర్లు పతనమైన క్రమంలో కంపెనీ సీఈవో జెఫ్‌ బెజోస్‌ భారీగా సంపద కోల్పోయారు. ఈ క్రమంలో ఇన్నాళ్లుగా ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న బెజోస్‌ స్థానాన్ని మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ సొంతం చేసుకున్నారు. 


ఏడాది క్రితం వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బిల్‌ గేట్స్ ఉండగా.. 2018లో తొలిసారిగా జెఫ్‌ బెజోస్‌ ఆ స్థానంలో నిలిచారు. ఆ సంవత్సరం ఆయన సంపద 160 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇంతకు ముందున్న అత్యధిక సంపద రికార్డులను బెజోస్ చెరిపేసి.. సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే, మూడో త్రైమాసిక ఫలితాల్లో అమెజాన్‌ షేర్‌ విలువ 26 శాతం పడిపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గత రెండేళ్లలో ఇలా షేర్‌ విలువ పడిపోవడం ఇదే తొలిసారి. 


1987లో తొలిసారిగా బిల్‌ గేట్స్‌ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అప్పుడు ఆయన మొత్తం సంపద విలువ 1.25 బిలియన్‌ డాలర్లు. తర్వాత ఏడాది జెఫ్‌ బెజోస్‌ కూడా ఫోర్బ్స్‌-400 అత్యంత ధనికుల జాబితాలో చేరారు. 1998లో ఆయన సంపద 1.6 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. బెజోస్ తన భార్య మెకంజీ బెజోస్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. 39 బిలియన్‌ డాలర్ల సంపదను ఆమెకు భరణం కింద చెల్లించారు. దీంతో బెజోస్‌ సంపద కాస్త తరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: