బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. ఈ బంగారం ధరలు తగ్గడం చూసి ప్రజలంతా షాక్ కు గురవుతున్నారు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 10 పెరుగుదలతో 38,475కు చేరుకుంది. కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో రూ.36,740కు చేరుకుంది. కాగా గత వారం బంగారం ధర 1.31 శాతం పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది.             


ఇప్పుడు ఒకేసారి ఇంత తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.450 దిగొచ్చి రూ.48,500కు చేరుకుంది. అయితే గతవారం 1.5 శాతం పెరిగి అందరికి షాక్ ఇచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలానే ఉన్నాయి.


గతవారం ధన్‌తెరాస్, దీపావళి పండుగలు రావడంతో అమ్మకాలు భారీగా పెరుగుతాయని బంగారం ధర భారీగా పెరిగింది. అయితే ఈసారి ధరలు ఆకాశాన్ని తాకడంతో పసిడి ప్రేమికులు పండగకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే గత సంవత్సరంలో ఈ పండుగలకు భారీగా అమ్మకాలు జరిగాయి. దీంతో ఈసారి అలానే ఉంటుంది అని ఉహించగా పెద్దగా ఉపయోగం లేకపోయింది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగి, ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1,516.65 డాలర్లకు చేరింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: