నేడు బాలల దినోత్సవం. అందుకే పిల్లలకు సంబంచి ఏ బ్యాంకు అకౌంట్లు తెరిస్తే ఎన్ని లాభాలు ఉంటాయి.. పిల్లలకు ప్రత్యేకమైన బ్యాంకు అకౌంట్లు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంకా విషయానికి వస్తే.. ఎవరికి అయినా ఒకప్పుడు 18 ఏళ్లు నిండక బ్యాంకు అకౌంట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆలా కాదు చిన్ననాటి నుంచే వారికీ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. 


అయితే దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు పిల్లల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్ సేవలను అందిస్తున్నాయి. పిల్లల పేరుతో ఈ బ్యాంకు ఖాతాలను తెరవచ్చు ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా పిల్లలకు చిన్ననాటి నుండే బ్యాంకు సేవలపై అవగాహనా ఉంటుంది. డబ్బు పొదుపు వంటి వాటి గురించి వారికీ వివరించచ్చు. 


బ్యాంకులు పిల్లలకు అందించే సేవింగ్ అకౌంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకోండి... 


ఎస్బిఐ.. 18 ఏళ్ల వయసులోపు ఉన్న వారైనాసరే ఎస్‌బీఐ పెహ్లి కడమ్ అండ్ పెహ్లి ఉడాన్ సేవింగ్స్ ఖాతాను తెరవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షులతో పాటు పిల్లల పేరుపై జాయింట్ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఆ అకౌంట్‌తో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి పలు సేవలను పొందవచ్చు. అయితే రోజుకు లావాదేవీలపై ఇన్ని అని పరిమితి ఉంటుంది. ఈ అకౌంట్ కు చెక్‌బుక్ కూడా ఇస్తారు. 


హెచ్ డి ఎఫ్ సి.. 18 ఏళ్లకు లోపు ఉన్న వారు ఈ బ్యాంక్ అకౌంట్‌ను తెరవొచ్చు. ఈ బ్యాంకు అకౌంటుతో పాటు డెబిట్ కార్డు ఇస్తారు. రోజుకు రూ.2,500 నుంచి రూ.10,000 వరకు ఈ అకౌంట్ నుంచి ఖర్చు పెట్టొచ్చు. అంతే కాదు ఈ హెచ్‌డీఎఫ్‌సీ కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్‌పై ఉచిత ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. దీనికి మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తిస్తాయి. నెలకు ఎంతకాదన్న బ్యాలెన్స్ కనీసం రూ.5,000 ఉండాలి. పాస్‌బుక్, ఫోన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు ఈ అకౌంట్ తో లభిస్తాయి.


ఐసీఐసీఐ.. ఐసీఐసీఐ బ్యాంక్ పిల్లల కోసం యంగ్ స్టర్స్ సేవింగ్స్ అకౌంట్ సేవలు అందిస్తోంది. ఈ అకౌంట్‌పై డెబిట్ కార్డు కూడా ఇస్తారు. రోజుకు రూ.2,500  షాపింగ్ చేసుకోగా.. ఏటీఎం నుంచి రూ.5,000 వరకు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్, పర్చేస్ ప్రొటెక్షన్ కవర్ వంటి సదుపాయలు కూడా ఉన్నాయి. 18 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఈ అకౌంట్ తెరవొచ్చు.
చూశారుగా పిల్లల కోసం ఎన్ని ప్రత్యేకమైన లాభాలు ఉన్నాయి అనేది. ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకు కూడా బ్యాంకు అకౌంట్ తెరిపించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: