బంగారం ధరలు అసలు అర్థం కావు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతుంది. ఇలా తగ్గుతూ పెరుగుతూ వచ్చే బంగారం ధర కేవలం ఐయుదు రోజుల్లోనే ఐయుదు వందల రూపాయిలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో బలిహీనమైన ట్రెండ్, జువెలర్ల నుండి భారీగా డిమాండ్ తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

                  

ఎంసీఎక్స్ మార్కెట్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ గోల్డ్ కాంట్రాక్ట్ ధర ఈరోజు ఉదయం సెషన్‌లో 0.4 శాతం తగ్గుదలతో 10 గ్రాములకు రూ.37,746కు దిగొచ్చింది. బంగారం ధర గత 5 రోజులుగా పడిపోతూ వచ్చింది. ఈ 5 రోజుల్లోను 10 గ్రాముల బంగారం ధరకు దాదాపు రూ.500 దిగొచ్చింది.

                   

అయితే బంగారం బాటలోనే వెండి కూడా తగ్గింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ధర కేజీకి 0.8 శాతం క్షీణతతో రూ.44,135కు దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో అయితే వెండి ధర ఈ రోజు వారం కనిష్ట స్థాయికి పడిపోయింది. అంటే కేవలం ఈ వారం రోజుల్లోనే దాదాపు 1000 రూపాయిల వరుకు బంగారం ధర తగ్గింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

                

అయితే దేశీ మార్కెట్ లో ఈ సంవత్సరం భారత్‌లో బంగారం ధర ఏకంగా 20 శాతం పరుగులు పెట్టింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో సెప్టెంబర్ నెలలో 10 గ్రాముల బంగారం ధరకు ఏకంగా రూ.40 వేల మార్క్‌పైకి చేరింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా కేజీకి రూ.50 వేల పైకి ఎగసింది. అయితే తర్వాత తగ్గుతూ వచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: