బంగారం ధరలు ఈరోజు మళ్ళి దిగొచ్చాయి. ఒక రోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటికి నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేడు ఈరోజు బంగారం ధర భారీగా దిగొచ్చింది. తులం బంగారం 35 వేల దిశగా పతనం అవుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో నేడు బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిల తగ్గుదలతో  39,410 రూపాయలకు చేరింది.  

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయిల తగ్గుదలతో 36,130 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. బంగారం కంటే వెండి ధరే ఎక్కువగా తగ్గింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 100 రూపాయిలు తగ్గుదలతో 46,300 రూపాయలకు చేరింది. 

 

అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె  కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిల తగ్గుదలతో  38,100 రూపాయలకు చేరింది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయిలు తగ్గుదలతో 36,900 రూపాయలకు చేరింది.  

 

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. ఎందుకంటే రేపు మళ్ళి ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి.  

మరింత సమాచారం తెలుసుకోండి: