తెలంగాణలో ఈ సారి ఖరీఫ్‌లో వరి దిగుబడి బాగా వచ్చింది. కానీ... అన్నదాత కళ్లలో మాత్రం ఆ సంతోషం అట్టే నిలవలేదు. ధాన్యం కోనుగోళ్ల కేంద్రాల్లో జరుగుతున్న అన్యాయం రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. తూకం పేరిట జరుగుతున్న దొపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. 

 

అన్నదాతకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి వెళ్తే... అడ్డగోలుగా దోచుకుంటున్నారు అక్రమార్కులు. ఈ సారి ఖరీఫ్‌లో ప్రకృతి సహకరించడం వల్ల దిగుబడి బాగుంది. అయితే... కొనుగోలు కేంద్రాల్లో రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వరి రైతులది  ఇదే పరిస్థితి. ఇక నిజామాబాద్‌ జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 

 

నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది 7 లక్షల 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని భావించారు అధికారులు. దిగుబడి బాగుండడం వల్ల ఈ సారైనా తమ కష్టాలు గట్టెక్కుతాయని.. సరుకుతో వస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల్ని నిండా ముంచేస్తున్నారు. తేమ 17 శాతంలోపు ఉండేలా ధాన్యాన్ని తీసుకువస్తే ఏలాంటి షరతులు లేకుండా కోనుగోలు చేయాల్సిందేని ఉన్నాతాధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అది అమలుకావడం లేదని వాపోతున్నారు రైతులు. 20 క్వింటాల ధాన్యంలో తరుగు పేరిట 50 కిలోలను తీసేయడం వల్ల 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు నష్టపోతున్నాడు రైతు. అంతేకాదు గోనె సంచి బరువు 600 గ్రాములైతే... ఏకంగా 800 గ్రాములను తరుగు క్రింద లెక్కగడుతున్నారు. ఇలా... రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు. 

 

తరుగు తీయకుంటే రైస్ మిలర్లు ఒప్పుకోవడం లేదని లేదన్నది కోనుగోలు కేంద్రాల నిర్వాహకుల మాట. దీంతో అధికారులు, రైస్ మిల్లర్లు, కోనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు రైతులు. అందరూ ఏకమై తమ శ్రమను దొచుకుంటున్నారు వాపోతున్నారు అన్నదాతలు. ఇప్పటికైనా ధాన్యం కోనుగోలు కేంద్రాలలో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు రైతులు. రైస్ మిలర్లు సహకరిస్తున్న అధికారులు, నిర్వాహకులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: