స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) డెబిట్ కార్డ్ వినియోగదారులు బిగ్ స్ట్రోక్‌. జ‌న‌వ‌రి 1 నుంచీ మీ డెబిట్ కార్డులు ప‌ని చేయ‌వు. ఎందుకంటే.. దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ తన కస్టమర్లు వెంటనే మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని ఇప్ప‌టికే సూచిస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి మ్యాగ్‌స్ట్రిప్ కలిగిన డెబిట్ కార్డులను ఎస్‌బిఐ బ్లాక్ చేస్తుంది. దీంతో డిసెంబర్ 31వ తేదీలోగా ఈ కార్డులు మార్చుకోవాలని, కొత్త ఈవిఎం చిప్, పిన్ ఆధారిత డెబిట్ కార్డులను తీసుకోవాలని బ్యాంకు మరోసారి సూచించింది.

 

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ ప్రవేశ పెట్టింది. అయితే కొత్త ఈవిఎం చిప్ కార్డుల కోసం కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బిఐ కస్టమర్లు కు వెళ్లి ఏటిఎం కార్డ్‌ సర్వీసెస్‌ పైన క్లిక్ చేయాలి. 

 

ఆ తర్వాత పేజీలో సూచనలు పాటిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ యోనో యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈవిఎం చిప్ కార్డులు లేని ఎస్‌బిఐ కస్టమర్లు హోమ్ బ్రాంచీకి వెళ్లి తమ మ్యాగ్‌స్ట్రిప్ కార్డు స్థానంలో వీటిని మార్చుకోవచ్చు. మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల స్థానంలో ఈవిఎం చిప్ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఎస్‌బిఐ తమ కస్టమర్లకు పదేపదే విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: