ఇటీవల టెక్నాలజీ వినియోగం తప్పనిసరి కావడంతో ప్రజలు కూడా వాటి వాడకాన్ని బాగా పెంచుతున్నారు . ప్రతి చిన్న సంస్థ నుండి పెద్ద సంస్థ వరకు అందరూ కూడా డిజిటల్ కార్యకలాపాలతోనే ముందుకు సాగుతున్నారు. అయితే ఇటువంటివి ఎక్కువ అవడం వలన కొందరు దుండగులు వాటిని తప్పుడు పద్ధతులకు వినియోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు టెక్నాలజి ని తప్పుగా వాడి క్రెడిట్, డెబిట్ కార్డులు, బ్యాంకు లోన్లు వంటివి పొందుతున్న కొందరు మోసగాళ్లు, దానిని ప్రస్తుతం మరింత విస్తృతం చేసి పలు ఈ కామర్స్ సంస్థల నుండి డేటాని సేకరించి, కస్టమర్ల అడ్రెస్స్ లు, ఫోన్ నంబర్స్ సహాయంతో వారిని బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల ప్రముఖ సోషల్ మాధ్యమం ఫేస్ బుక్ నుండి కొంతమంది వినియోగదారుల డేటా లీక్ అయినా వార్త అందరినీ హడలెత్తించగా, 

 

నేడు ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్, స్నాప్ డీల్, క్లబ్ ఫ్యాక్టరీ వంటి వాటి నుండి డేటా లీక్ అవడంతో కొందరు వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, కొందరు మోసగాళ్లు టెక్నాలజీని వినియోగించి, తెలివిగా భారీగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్, తదితర సంస్థల నుండి కస్టమర్ల డేటా ని తస్కరించి, దానితో కస్టమర్లకు ఫోన్లు చేసి, మీకు బహుమతులు వచ్చాయి, ముందుగా డబ్బులు కట్టండి అంటూ తప్పుడు కాల్స్ చేస్తారు. అయితే అది నిజంగానే సదరు సంస్థ నుండి వచ్చిన కాల్ అని భావించిన కస్టమర్, వారికి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. కాగా డబ్బులు తీసుకున్న తరువాత ఏ మాత్రం స్పందించని ముఠా, తెలివిగా ఫోన్ నెంబర్ తీసేస్తుంది. ఈ తరహా నయా మోసాన్ని నేడు సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. కొందరు వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, 

 

ఎంతో తెలివిగా వ్యవహరించి మోసగాళ్లను వలపన్ని పట్టుకున్నారు. అయితే నిందితులు వినియోగిస్తున్న అధునాతన పద్ధతులు పరికరాలు చూసి ఖంగుతిన్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటన పై పూర్తి వివరాలు వెల్లడి కావలసి ఉంది. అయితే ఈ డేటా లీక్ అంశంలో ఈ కామర్స్ సంస్థల ప్రమేయం ఎంతవరకు ఉంది అనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు టాక్. ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఈ వార్త ఎంతో వైరల్ అవుతోంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: