డబ్బు ఆదా చేసుకోవాలి అనుకుంటున్నారా ? అయితే మీకోసమే అదిరిపోయే స్కీం.. అందరూ డబ్బు ఆదా చేసుకోవాలి అనుకుంటారు.. కానీ కొందరే ఆదా చేసుకోగలరు.. కారణం.. ఎలా ఆదా చేసుకోవాలో వారికీ తెలియదు. అయితే ఆలాంటి వారు అంత ఎలా ఆదా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదికి రూ.2 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. దాని గురించి పూర్తిగా ఇక్కడ చదివి తెలుసుకోండి. ఉద్యోగులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులు ఎన్‌పీఎస్ స్కీమ్‌పై పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. పీఎఫ్ఆర్‌డీఏ ప్రకారం.. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. 

 

ఎన్‌పీఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే వారు వ్యాపారం చేస్తూ ఉంటే సెక్షన్ 80 సీసీడీ కింద స్థూల ఆదాయంలో కంట్రిబ్యూషన్స్‌ ద్వారా 20 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ఈ పరిమితి దాటి మినహాయింపు లభించదు.

 

ఎన్‌పీఎస్ స్కీమ్‌పై మరో పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఎన్‌పీఎస్ స్కీమ్‌పై అదనంగా మరో రూ.50,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80సీసీడీ కింద ఈ ఫెసిలిటీ పొందవచ్చు. ఈ మినహాయింపు రూ.1.5 లక్షలకు అదనం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: